గరుడ వాహనంపై.. వేంకటేశ్వరుడు..
1 min readపురవీధుల్లో ఊరేగించిన భక్తులు
కర్నూలు, పల్లెవెలుగు: స్థానిక సంకల్ భాగ్ లో వెలిసిన శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయంలో సరస్వతి పూజ, హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, వారికి పలక, బలపం, పెన్ను, పెన్సిళ్లు, నోట్ బుక్కులు ఉచితంగా అందజేశారు. తదనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో 1500 మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు నగర బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ తెలిపారు. సాయంత్రం శ్రీ భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వర స్వామిని గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమం ఎన్ఆర్ పేట విహరించి స్వామి వారు ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.