PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పశువైద్య సేవలు

1 min read

పశువులకు టీకాలు, మినరల్ మిక్స్ పంపిణీ

పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి. నెహ్రూబాబు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాలు మేరకు పలు ప్రాంతాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి. నెహ్రూబాబు చెప్పారు.  ఇందులో భాగంగా గత నాలుగు రోజుల్లో 121 ఆవులు, 51 గేదెలు, 132 మేకలు, 35 గొర్రెలు కలిసి 339 పశువులకు వైద్య సేవలు అందంచడం జరిగిందన్నారు.  అదే విధంగా మినరల్ మిక్సర్ 339 కేజీలు పంపిణీ చేశామన్నారు.  వ్యాధి నిరోధక టీకాలు కింద హెచ్ ఎస్- 913 డోసులు, ఇటి-1046 డోసులు వేయడం జరిగిందన్నారు.  ఇప్పటి వరకు వేలేరుపాడు మండలం మేడేపల్లి,కోయమాధారం, రామవరం,ఉదయనగర్, గుండ్లవై,  కక్కునూరు మండలం ఇసుకపాడు, గొమ్ముగూడెం, ఉప్పరమద్ధిగట్ల,లచ్చిగూడెం, కౌండిన్యముక్తి గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించామన్నారు.

About Author