జయం మనదే..!
1 min readఅట్టహాసంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సుధీర్ ధారా నామినేషన్
భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు.
15 వేలమంది వైసీపీ సైన్యంతో ర్యాలీ.
ఉప్పొంగిన అభిమానంతో తడిచి ముద్దయిననాయకులు.
గెలుపు మాదే అంటూ.. వైసీపీ నాయకుల ధీమా.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జయం మనదే అంటూ వైసీపీ కార్యకర్తలు గర్జించారు. నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా డా.సుధీర్ ధారా వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారుల సాక్షిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పగిడ్యాల రోడ్డు లోని బ్రహ్మంగారి మఠం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి, వైసీపీ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళీ, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రవి యాదవ్, ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి, తదితరులు ర్యాలీలో డా.సుధీర్ ధారా కు మద్దతుగా నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. సుమారు 15 వేల మంది వైసీపీ సైన్యం నామినేషన్ కార్యక్రమంలో కదం తొక్కి గెలుపు మాదే అంటూ గర్జించారు. నందికొట్కూరు పట్టణం లోని అన్నిరోడ్లు వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి. నందికొట్కూరు చరిత్రలో ఎన్నడూ లేని విదంగా అభిమానులు నామినేషన్ కార్యక్రమానికి తరలిరావడంతో గెలుపుపై వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.