విద్యా ప్రదాత..మహబూబ్ సాహెబ్
1 min readవిద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచిన వారికి సొంత ఖర్చుతో టీ షర్టులు,మెడల్స్, నగదు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యార్థుల విద్యాభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తానని విద్యార్థులను ఉత్తేజ పరిచేందుకు ముందుకు వచ్చారు మైనార్టీ నాయకులు ఆల్ హజ్ హాజీ మహబూబ్ సాహెబ్ (తాటిపాడు మహబూబ్ బాష).. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ ఉన్నత గాంధీ మెమోరియల్ పాఠశాలలో జరిగిన స్కూల్ గేమ్స్ ఆటల పోటీల బహుమతుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.గెలుపొందిన విద్యార్థులకు మహబూబ్ సాహెబ్ బహుమతులను అందజేశారు.ఈ ఆటల పోటీలకు గాను ముందుగా క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు టీ షర్టులు,మెడల్స్, మెమెంటోలు సొంత ఖర్చుతో ఆయన అందజేశారు.ఆటల్లో గెలుపొందన విద్యార్థులకు మెడల్స్,మెమెంటోలు అందజేశారు.ఈ సందర్భంగా మహబూబ్ సాహెబ్ మాట్లాడుతూ ప్రస్తుతం చదివే పదవ తరగతి విద్యార్థులు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారికి 1,016 రూ.లు తానే సొంతంగా ప్రతి సంవత్సరం అందజేస్తానని అన్నారు.రాబోయే రోజుల్లో జరిగే ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి వెయ్యి రూపాయలు అందిస్తానని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి మరియు ఉపాధ్యాయులు మహబూబ్ సాహెబ్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.