మహానంది దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : మహానంది దేవస్థానంలో సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఆధ్వర్యంలో కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. టికెట్ల విక్రయాలకు సంబంధించి గోల్మాల్ జరిగిందని ఫిర్యాదు మేరకు తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఈవో అందుబాటులో లేకపోవడంతో సంబంధిత రికార్డులను రెండు మూడు రోజుల లోపల తమకు అందజేయాలని అందుబాటులో ఉన్న ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరోమారు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తనిఖీల అనంతరం విజిలెన్స్ ఎస్పీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.