PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూటమి ప్రభుత్వంలో జోరుగా అభివృద్ధి పనులు…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు జోరుగా సాగుతూ గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి.ఈ నేపథ్యంలో మండల కేంద్రం 4 వ  వార్డ్ లోని ప్రధాన రహదారిలో కొత్త డ్రైనేజీ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ రోడ్డులో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో తిరుగుతూ ఉంటాయి. దీంతో ఈ దారిలో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు.అయితే ఇప్పుడు ఈ ప్రధాన దారిలో కొత్త డ్రైనేజీ నిర్మాణం చేపట్టి రోడ్డు వెడల్పు చేయడంతో ఈ దారిలో రాకపోకలకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ఈ రోడ్డులో కొత్త డ్రైనేజీ నిర్మాణం చేపట్టి,రోడ్డు వెడల్పు చేయడంతో స్థానికులు,రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ సుబాన్,మోయిన్,తెలుగుదేశం పార్టీ మైనారిటీ యువకులు సద్దాం, ఖాదర్,మహమ్మద్,స్థానికులు అబ్దుల్ సలాం,ఇస్మాయిల్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *