విజయ్ సాయి రెడ్డి పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాత్రికేయుల అనుచిత వ్యాఖ్యలు చేయడం నివసిస్తూ బుధవారం కర్నూల్ నగరంలో జర్నలిస్టు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్ష ,కార్యదర్శులు రామకృష్ణ ,సాయికుమార్ నాయుడు మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి రాజ్యసభ హోదాలో ఉండి జర్నలిస్టులపై ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రైవేటు వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో పాటు ఓ భర్త తన అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కినప్పుడు వాటిని ప్రచురించడం తప్పని ప్రశ్నించారు. అది ప్రైవేటు వ్యవహారం ఇంటి వరకు ఉంటే.. అందులో పాత్రికలు జోక్యం చేసుకునే వారు కాదన్నారు.. కానీ రోడ్డు ఎక్కినప్పుడు… అది పబ్లిక్ ఇష్యుగా పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను బేరిజ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మహా న్యూస్ ఎండీ వంశిక్రిష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నేత విజయసాయి రెడ్డి పాత్రికేయులకు బహిరంగ క్షమాపణ లు చెప్పాలని కోరారు. ఈ క్రమంలో కర్నూల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన, ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి నాగరాజు గౌడ్, , మధుసూదన్ రెడ్డి, ఉరుకుందు, రవికుమార్, సుంకన్న, నరసింహులు, మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ సర్కిల్లో ఆందోళన నిర్వహించారు. బాధ్యతమైన పదవిలో ఉండి జర్నలిస్టులనుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని తక్షణమే రాజ్యసభ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఆయన చేసిన వ్యాఖ్యాలు విరమించుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఏపీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికుమార్ నాయుడు హెచ్చరించారు.
నంద్యాలలో నిరసనలు
మహా న్యూస్ ఎండీ వంశిక్రిష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి నేత విజయసాయి రెడ్డి పాత్రికేయులకు బహిరంగ క్షమాపణ లు చెప్పాలని కోరుతూ నంద్యాల పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ర్యాలీ,నిరసన కు తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి.ఫిరోజ్,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది తాతి రెడ్డి తులసి రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం పట్టణ కార్యదర్శి జగన్ మోహన్ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు కంభం సతీష్ కుమార్,జాకీర్ ,ఉపాదక్ష్యులు పి.అర్.కుమార్,రవూఫ్,రాము,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.