సిమెంట్ రోడ్లతో పల్లెలు కళకళ.. వాడవాడలా కూటమి బాట
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : కూటమి ప్రభుత్వం తీసుకున్న పల్లెపండుగ నిర్ణయంతో పల్లెలు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయి.బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న పల్లెపండుగ నిర్ణయంతో పల్లెలు సిమెంట్ రోడ్లతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో సిమెంట్‌రోడ్ల నిర్మాణంతో పల్లెలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. గౌరవనీయులైన ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వీరభద్ర గౌడ్ మా యంగ్ లీడర్ శ్రీ గిరీష్ గౌడ్ ఆదేశాలతో ఆలూరు మండలం పెద్దహోతురు గ్రామం ఎస్సీ కాలనీలో సిమెంట్‌రోడ్లు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్ , గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్,పెద్దాయన హోతురప్ప,యంగ్ డైనమిక్ టైగర్ లక్ష్మణ గారు బిజెపి,జనసేన,తెలుగుదేశం యువ నాయకులు పాల్గొన్నారు.