ఈనెల 14 నుండి గ్రామాల్లో “పల్లె పండుగ”..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఈనెల 14 వ తేదీ నుండి”పల్లె పండుగ”అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉపాధి హామీ పథకం ఏపీడీ అన్వరా బేగం అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉపాధి కార్యాలయంలో మంగళవారం ఉపాధి సిబ్బందితో “పల్లె పండుగ” కార్యక్రమం గురించి ఏపీడీ ఉపాధి సిబ్బందితో మాట్లాడారు.కొత్త రోడ్ల నిర్మాణం పనులు చెప్పటబోయే వాటికి సమాచార బోర్డు ఉండాలని సిబ్బందికి సూచించారు.200 రోజుల యాక్షన్ ప్లాన్ హౌసింగ్ పని దినాలు హార్టికల్చర్,ఫారం పాండ్,మినీ గోకులం అన్ని గ్రామాలలో సెల్ఫ్ఆఫ్ వర్క్స్ సంవృద్ధిగా వుండేటట్లు చూడాలని ఈసీ సాంకేతిక సహాయకులను ఆదేశించారు. వివిధ అంశాలపై సిబ్బందితో చర్చించారు.ఆగస్టు 23 వ తేదీన ఒకే రోజున గ్రామాల్లో జరిగిన ఉపాధి గ్రామసభల్లో గ్రామాల్లో సీసీ రోడ్ల గ్రామ సభ తీర్మానం పంపిన వాటికి ఈ కార్యక్రమం ద్వారా పల్లెల్లో సిమెంట్ రోడ్ల పనుల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని ఆమె అన్నారు.ఈ గ్రామ సభల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ అలివేలు మంగమ్మ,ఈసీ షబాన, జలకళ స్వాములు,టెక్నికల్ అసిస్టెంట్లు కవిత,ఉమేష్ మరియు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.