విహెచ్పి”షష్టిపూర్తి” లోగా గ్రామ గ్రామాన గ్రామ కమిటీలు వేయాలి..
1 min readవిశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలో, భరతమాత మందిర ప్రాంగణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం లో జరిగిన కర్నూలు జిల్లా సమావేశానికి ముఖ్యఅతీథిగా విచ్చేసిన దక్షిణాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు మాట్లాడుతూ రాబోయే విశ్వ హిందూ పరిషత్ “షష్టిపూర్తి”(60 సం.లు) పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 1964 సం.లో పవిత్ర శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ముంబయ్ లోని సాందీపని ఆశ్రమంలో పుట్టిన విశ్వ హిందూ పరిషత్ దిన దిన ప్రవర్ధమానమై 125 దేశాల్లో మరియూ భారతదేశంలో 60 లక్షల మంది కార్యకర్తలు,12 వేల మంది పూర్తి సమయ కార్యకర్తలు( తమ జీవితాలను పూర్తిగా సంస్థకే ఇచ్చి పనిచేసే వారు) పనిచేస్తున్నారనీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారనీ,విశ్వ హిందూ పరిషత్ లో 16 విభాగాలు పనిచేస్తున్నాయని తద్వారా హిందూ సమాజానికి ఎదురయ్యే అనేక సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలౌతుందన్నారు, కాబట్టి కర్నూలు జిల్లా కార్యకర్తలందరూ షష్టిపూర్తి సందర్భంగా జిల్లాలో అన్ని ప్రఖండలలో కనీసము 4 గురు కార్యకర్తలతో సమితుల నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ…రాబోయే షష్టిపూర్తి సందర్భంగాకర్నూలు జిల్లా లో కూడా 9 మండలాల్లో, నగరంలోని 195 బస్తీల్లో తప్పక సమితులను నిర్మాణం చేస్తామనీ , ఈ 40 రోజులు యుద్ధప్రాతిపదికన ఈ సమితుల నిర్మాణం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో….విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ, కర్నూలు జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహకార్యదర్శులు గూడూరు గిరిబాబు, గోవిందరాజులు,జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ రాజేష్, జిల్లా మాతృశక్తి సంయోజిక శ్రీమతి రాధిక, జిల్లా సేవా ప్రముఖ్ తుంగా రమేష్ ,బజరంగ్ దళ్ సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరామ్, నగర బజరంగ్ దళ్ కన్వీనర్ తెలుగు భగీరథ, ప్రఖంఢ కారైయకర్తలు, పీ వెంకటేశ్వర రావు, నటరాజ్,కరణం సుధాకర్, మణి, రాజారెడ్డి, రమణారెడ్డి, బాబురావు, సంజీవయ్య,రాజు,తదితరులు పాల్గొన్నారు.