భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగ జరుపుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : వినాయక చవితి పండుగ ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఇన్చార్జ్ డిఎస్పీ శ్రీ నివాస చార్ సూచించారు. బుధవారం మంత్రాలయం పోలీసు స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి పండుగ హిందు సాంప్రదాయ పద్ధతిలో ప్రజలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వినాయకుని కూర్చోబెట్టేందుకు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని సూచించారు. గొడవలకు పోకుండా సోదర భావంతో జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుపుకోవాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం రోజు సూర్యుడు మునగక ముందే చేయాలన్నారు. రాత్రి వేళల్లో చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వినాయక మంటపాల్లో భక్తి గీతాలు పెట్టుకోవాలని అశ్లీల నృత్యాలు, పాటలు పెట్టరాదన్నారు. ఏమైనా సమస్యలు కానీ గొడవలు కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సిఐ రామాంజులు, ఎస్ఐ పరమేష్ నాయక్, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.