విశ్వబ్రాహ్మణులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..
1 min readఉమ్మడి జిల్లాప్రధాన కార్యదర్శి ఏ శివశ్రీ
ఆగష్టు11న వార్షికోత్సవం ఆహ్వానపత్రంవిడుదలచేసిన విశ్వబ్రాహ్మణ సంఘనేతలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని వస్తోత్పత్తిలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన విశ్వబ్రాహ్మణులు పారిశ్రామిక వేత్తలు గాఎదగాలని విశ్వబ్రాహ్మణ ఉద్యోగవ్యాపారులసంక్షేమసంఘ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి అప్పలభక్తులశివకేశవరావు పేర్కొన్నారు.శుక్రవారంస్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆవరణలో విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారుల సంక్షేమ సంఘ 9వవార్షికోత్సవ ఆహ్వానపత్రిక ను సంఘనేతలతోకలశి ఆవిష్కరించారు.ఆగష్టు11వతేదిన సా.4గం.కు స్థానికఫైర్ స్టేషన్ వద్ద గల రెవెన్యూ భవన్ లో సంఘవార్షికోత్సవంనిర్వహిస్తున్నట్లు ప్రధానకార్యదర్శి లంకలపల్లిజగదీష్ తెలిపారు. ఈకార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందించి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అలాగే సంఘ ప్రముఖులు కార్పెంటర్స్ సంఘరాష్ట్రనాయకులు వేములదుర్గాప్రసాద్,స్వర్ణకరసంఘ సీనియర్ నాయకులు చిట్టూరి ఉమామహేశ్వరరావులను ఘనంగసన్మానించనున్నట్లుతెలిపారు.ఈకార్యక్రమానకి ముఖ్య అతిధులుగా ఏలూరు ఎంపి పుట్టామహేష్ కుమార్ ఎంఎల్ఏ బడేటిచంటిలు.కూటమి నేతలు తపనాచౌదరి,రెడ్డిఅప్పలనాయుడులను గౌరవ తిధులుగా ఆహ్వానిస్తున్నట్లు శివశ్రీ తెలిపారు. జిల్లానాయకులతోపాటు జిల్లాలోని అన్నిమండలసంఘ నాయకులు ఈకారైయక్రమానికి హాజరవుతారని పేర్కొన్నారు.ఈసభలో విశ్వబైరాహ్మణ సంస్కృతి సాంప్రదాయాలు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోపాటు విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపారు.ఈసందర్భంగాశివశ్రీ మాట్లాడుతూ.గతప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకిచ్చిన ఏఒక్క హమిని నెరవేర్చలేదని తెలిపారు.కూటమిప్రభుత్వాన్ని ఆహ్వానించిన విశ్వబ్రాహ్మణులసమస్యలపట్ల కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు.పారిశ్రామికంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాలను విశ్వబ్రాహ్మణులకు వర్తింప చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణసంఘ అధ్యక్షులు సింహాద్రి భృంగాచార్యులు, కార్యదర్శి మానేపల్లినాగేశ్వరరావు,కార్పెంటర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేములదుర్గాప్రసాద్, ఉద్యోగ వ్యాపారులసంక్షేమసంఘ నాయకులు కోడూరి రామకృష్ణ, గొల్లపల్లి సుధాకర్ ,వేములదుర్గాప్రసాద్,గొల్లపల్లికామేశ్వరరావు, సింహాద్రిభృంగాచార్యులు,పొట్నూరుశివరావు,కొక్కొండనాగేశ్వరరావు,ముంగండశ్రీనివాసరరావుశర్మ,ముసినాడసోమశేఖర్,మానేపల్లినాగేశ్వరరావు,కోడూరిరామకృష్ణ.తదితరులుపాల్గొన్నారు.