PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వకర్మ యోజన పథకం కింద చేతివృత్తుల పనివార్లను ప్రోత్సహించండి

1 min read

అర్హులైన చేతివృత్తుదారులకు రుణ సౌకర్యం కల్పించండి.

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద గుర్తించిన చేతి వృత్తుల పనివారలను ప్రోత్సహిస్తూ రుణసౌకర్యం కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శనివారం విశ్వకర్మ యోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ విశ్వకర్మ యోజన పథకం కింద 18 రకాల చేతి వృత్తులదారులు అర్హులు అవుతారని ఇందుకు సంబంధించి జిల్లాలో స్వీకరించిన 51,920 ధరఖాస్తులను మరొక్కసారి సమగ్రంగా పరిశీలించి నివేదికలు ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత చేతివృత్తుల పనివాళ్లు వంశపార పర్యంగా చేస్తున్నారా, నిజమైన చేతివృత్తులదారుల కాదా అని పరిశీలించాలన్నారు. నిజమైన చేతివృత్తుల పనివారలైతే గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సర్పంచ్ ద్వారా, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ల ద్వారా సంబంధిత లాగిన్ లో సిఫార్సు చేస్తున్నట్లు ధృవీకరించాలన్నారు. స్వీకరించిన 51,920  ధరఖాస్తులలో పరిశీలించగా 40,009 అర్హత ఉన్నాయని, 11,764 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా 147 దరఖాస్తులను తిరస్కరించామని పరిశ్రమల జిల్లా మేనేజర్ కలెక్టర్ కు నివేదించారు. గుర్తించిన వారిలో వడ్రంగి, పడవల తయారీ, కవచ తయారీ, కమ్మరవాడు కమ్మర, సాధనం పనిముట్టు, తాళాల తయా రీదారులు, శిల్పి, వెండి, బంగారం, మొదలై న లోహాలతో ఆభరణాలు చేయు స్వర్ణ శిల్పి, కుమ్మరి, చెప్పులు కుట్టు వాడు, తాపీ మేస్త్రీ, బుట్ట తయారీ, బొమ్మ తయారి, పూల మాలలు అల్లేవారు, డాభా, దర్జీలు, చేపల వల తయారీ తదితర చేతివృత్తుల వారిని గుర్తించామని కలెక్టర్ కు వివరించారు. గుర్తించిన చేతివృత్తుల వారలను సమగ్రంగా పునః పరిశీలించి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన చేతి వృత్తిదారులకు గుర్తింపు కార్డుతో పాటు సంబంధిత రంగాలలో శిక్షణ ఇవ్వాలన్నారు.  శిక్షణ కార్యక్రమంలో 500 రూపాయలు స్టైఫండ్ తో పాటు15 వేల రూపాయల ఉచిత పనిముట్లు కూడ పంపిణీ చేయాలన్నారు. అలాగే చేతి వృత్తిదారులకు 5 శాతం వడ్డీతో లక్ష రూపాయల రుణము సక్రమంగా తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల రుణము మంజూరు చేయడంతో పాటు మార్కెట్ సౌలభ్యం కూడా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల జిల్లా మేనేజర్ శ్రీనివాస యాదవ్ , పంచాయతీ అధికారి మంజుల వాణి, లీడ్ డిస్టిక్ మేనేజర్ రవీంద్ర కుమార్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి,  మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, డి ఎల్ డి ఓ కళ్యాణి, కేంద్ర ప్రభుత్వ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author