జిల్లా జైలు ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
1 min readపల్లెవాణి వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శిక్షణ న్యాయమూర్తులు మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కు సంబందించిన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యస్. మనోహరు పంచలింగాల గ్రామం నందు గల జిల్లా జైలును సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీల వివరాలను సంబందిత జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు వారికి అందించే భోజన సదుపాయాలను స్వయంగా పరిశీలించి, పర్యవేక్షణ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. ఖైదీలతో మాట్లాడటానికి వచ్చే వారికి మాట్లాడే సదుపాయాన్ని పరిశీలించారు. ఉన్నత న్యాయ సేవ అధికార సంస్థ ఏర్పాటుచేసిన చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్ ద్వారా అందిస్తున్న మెరుగైన ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.