గురుకులం పాఠశాలను సందర్శించిన విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రెటరీ
1 min readవిద్యార్థులతో చర్చించి సూచనలు సలహాలు అందించారు
ప్రాంగాణాన్ని,భోజన వసతులను పరిశీన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: డా:బి.ఆర్.అంబేద్కర్ గురుకులం,వట్లూరు ను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రటరీ ఎ. మురళి కృష్ణ సందర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో పరీక్షల గురించి మాట్లాడి, కొన్ని సూచనలు అందించారు. విద్యార్థుల వసతి గృహం, తరగతి గదులు, భోజన శాల పరిశీలించి భోజనం రుచి చూశారు. ప్రిన్సిపల్ మేరీ ఝాన్సీ రాణితో మరియు ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు.కళాశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.