ఏలూరు డిఎస్పి ఆదేశాలతో విజువల్ పోలీస్ నిర్వహణ
1 min readబహిరంగ ప్రదేశాల్లో మద్యం సేమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏలూరు డి.ఎస్.పి డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వై వి రమణ యొక్క ఆధ్వర్యంలో ఏలూరు టూ టౌన్ ఎస్ఐ రామకృష్ణ వారి యొక్క సిబ్బందితో విజువల్ పోలీస్ నిర్వహిస్తూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 19 మంది పై మరియు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నటువంటి ఐదుగురు వ్యక్తులపై ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసినట్లుగా ఎస్సై రామకృష్ణ తెలియ చేసినారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరిస్తే అది మీ ప్రాణానికి ఎటువంటి హాని కలగకుండా కాపాడుతుందని, మద్యం సేవించి వాహనాలు నడిపితే మీ ప్రాణానికే కాకుండా ఏ తప్పు చేయని ఎదుటివారి ప్రాణాలు కూడా అపాయాలు జరుగుతాయని, ఇరువురి కుటుంబాలు సంతోషంగా గమ్యలకు చేరతారని అన్నారు.ప్రతిరోజు ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజువల్ పోలీస్సింగ్ నిర్వహిస్తామని ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియ చేసినారు.