PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని.. విశ్వనారాయణ ప్రవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

1 min read

పి డి ఎస్ ఓ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్డు దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి పిడిఎస్ఓ డివిజన్ సెక్రెటరీ శివ మాట్లాడుతూ…

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు : ఆదోనిలో ఉన్నటువంటి విశ్వ నారాయణ కళాశాలలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి వాటిలో ప్రధాన సమస్యలు జూన్ అకాడమీ ఇయర్ ,నుండి ఫిబ్రవరి మర్చి వరకు అధ్యాపకుల ద్వారా టీచింగ్ చెప్పించాలి .ఆ విధంగా కాకుండా కేవలం జూన్ నుండి నవంబర్ డిసెంబర్ వరకు మాత్రమే అధ్యాపకులను పెట్టుకొని తరువాత లెక్చరర్ లేకుండా స్టడీ అవర్స్ పేరుతో కాలయాపన చేస్తూన్నారు.అలాగే కొత్తగా వచ్చినటువంటి ఒకేషనల్ కోర్సులలో విద్యార్థులకు సరైన ఫ్యాకల్టీ లేక విద్యార్థులకు చదువుకు దూరం చేస్తున్నారు.మరోపక్కేమో విద్యార్థుల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు విద్యార్థి సంఘంగా ఒకటే అడుగుతున్నాం వేలకు వేలు ఫీజులు వసూలు చేసినప్పుడు విద్యార్థులకు సరైన విద్యను ఎందుకోసం అందించలేకపోతున్నారు గతంలో ఇలాంటివి చాలా జరిగినాయి అని అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల  నుండి తెలుసుకోవడం జరిగింది  .ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యాధికారులు తక్షణమే విశ్వ నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులని విచారణ చేసి కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి పీడీఎస్ ఓ విద్యార్థి సంస్థ తెలియజేయడమైనది.లేనియెడల పిడిఎస్ఓ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని  ఉన్నతాధికారులకు తెలియజేయడమైనది .ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్స్ నికిత కృష్ణవేణి, డివిజన్ నాయకులు అశోక్ గోవిందు బసవ ప్రవీణ్ నవీన్ కుమార్ అజయ్  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author