వాలంటరీలు జగన్మోహన్ రెడ్డి కి మద్దతుగా స్వచ్ఛందంగా రాజీనామా
1 min readఎమ్మెల్యే కి కార్పొరేటర్ పొలిమేర దాసు సమక్షంలో ఆవేదన వ్యక్త చేసిన మహిళలు
త్వరలో జగనన్న ప్రభుత్వం రాబోతుంది,
మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఓటు ద్వారా అందించండి
ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని భరోసా
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్ అందించే వాలంటీర్లను దూరం చేసిన చంద్రబాబు కూటమి కూలిపోవాలని 44వ డివిజన్ సంబంధించిన మహిళలు కార్పొరేటర్ పొలిమేర దాసు సమక్షంలో శుక్రవారం ఆళ్ళ నానిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో బ్యాంకులు చుట్టూ,కార్యాలయాల చుట్టూ వయసు పైబడిన మాలాంటివారు తిరగలేకున్నామని, చంద్రబాబు వల్లే ఇలా తిరిగేలా చేసారని, ఈ పాపం ఊరికే పోదని కన్నీటి పరమయ్యారు, రానున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్తే కీలకమని మని 44వ డివిజన్ కి సంబంధించిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందిస్తూ అవ్వ తాతల పెన్షన్ కష్టాలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. దానిలో భాగంగా 44 డివిజన్ కు చెందిన 5 మంది వాలంటీర్లు సి.ఎమ్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆళ్ల నానికి మద్దతుగా స్వచ్చందంగా రాజీనామా చేసి ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ అతి తక్కువ రోజుల్లో జగనన్న ప్రభుత్వ ఏర్పడనుందని, అవ్వ తాతలకు, వాలంటీర్లకు మంచి రోజులు తిరిగి రానున్నాయని నాని ఆవేదన చందవద్దని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో డివిజన్ సంబంధించిన మహిళలు తదితరులు పాల్గొన్నారని మీడియా కో-ఆర్డినేటర్ కోలా భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు.