PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెంటికి చెడ్డ రేవడిలా మారిన వాలంటీర్లు..

1 min read

కొత్త ప్రభుత్వం రాకతో ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : 2019 ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం గ్రామాలలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించాయి రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరి విధి విధానాలు ప్రభుత్వం అందించే నవరత్నాలు సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేయడమే లక్ష్యం కానీ ఇచ్చిన విధుల్ని అమలు చేయకుండా ప్రభుత్వం అండ చూసుకొని రెచ్చిపోయారు వైకాపా నాయకులు చెప్పిందే వేదంగా ఒకవైపే న్యాయం చేయడం చెప్పినదంతా చేయడం చేశారు అయితే కొన్నాళ్లకు వైసీపీ నాయకులు మాట కూడా వినని పరిస్థితికి మారిపోయారు పింఛన్ తప్ప ఎటువంటి పథకాలు డోర్ డెలివరీ చేయలేదు ఏదన్న ప్రభుత్వం పథకాలు ప్రకటిస్తే వాటి ఆఖరి తేదీ రెండు రోజులు ఉందనగా హడావుడిగా సదరు లబ్ధిదారులకు అప్లై చేసుకోమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం మా పని అంతే అని చేతులు దులుపుకోవడం చేశారు  ఇంట్లో కూర్చొని అవుట్ రీచ్ సర్వే చేశారని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తే కార్యాలయాలకు వచ్చిన సందర్భాలు కూడా తక్కువే ప్రభుత్వం మా కళ్ళు చెవులు అన్ని వాలంటీర్లు అని నెత్తికెక్కించుకోవడం వైసీపీ పభుత్వానికి నిట్ట నిలువనా ముంచింది ఇంట్లో కూర్చున్నా మేము గెలుస్తామని వాలంటీర్లు పథకాలు నేరుగా ప్రజలకు గడపగడపకు చేర్చారని డాబు కొట్టుకోవడం క్షేత్రస్థాయిలో ఫలితాలు వేరుగా ఉండడం గమనార్హం వాలంటీర్ వ్యవస్థ వల్ల తమకు ఏమీ ఒరగలేదని కనీసం కరోనా సమయంలో ఎటువంటి సహాయం అందకున్న వైసిపి ప్రభుత్వం మాత్రం సైనికుల్లా పనిచేశారని ఊకదంపుడు ప్రచారాలు మాత్రం ఘనంగా కొనసాగించింది ప్రభుత్వ కార్యాలయంలో షాడో వ్యవస్థల పనిచేస్తూ వచ్చిపోయే సమాచారాన్ని స్థానిక నాయకులకు అందించడమే విధిగా మార్చుకున్న వాలంటీర్లను మళ్ళీ టిడిపి ప్రభుత్వంలో తీసుకుంటే ప్రభుత్వానికి ఎటువంటి మైలేజీ రాదని స్థానిక నాయకులు జిల్లా నాయకులకు విన్నవించుకుంటున్నారు కష్టకాలంలో తమను ఆదుకున్న పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థలు చోటు కల్పించాలని పాత వాలంటీర్లను తీసుకోవద్దని వారిని తీసుకుంటే గత ప్రభుత్వంలో పని చేసిన నాయకులకు తమ సమాచారాన్ని తీసుకువెళ్లి ఇచ్చే అవకాశం ఉందని కాబట్టి పాత వాలంటీర్లను తీసుకోవద్దని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేల వద్ద టిడిపి మండల నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు వైసిపి ఎమ్మెల్యేలకు స్థానిక నాయకుల వెంట ఎన్నికల ప్రచారం నిర్వహించారని మరి వారిని తీసుకుంటే వ్యతిరేకిస్తామని టిడిపి నాయకులు చెప్పడం కొసమెరుపు మొత్తానికి ప్రభుత్వానికి పని చేయాల్సిన వాలంటీర్లు పార్టీ కార్యకర్తల్లో మారి బహిరంగంగా వైసిపి ప్రభుత్వం వస్తుందని జబ్బలు చర్చుకోవడం బహిరంగ రహస్యం మొత్తానికి నాయకుల మాటలు విని బలవంతంగా రాజీనామా చేయడమో లేక కృతజ్ఞత పూర్వకంగా జగనన్న ప్రభుత్వంలో తమకు అర్హత లేకుండా స్థానిక నాయకుల సిఫారసుతో వాలంటీర్లుగా కాలం వెళ్ళ దీసిన వారు ఐప్పుడూ లబోదిబోమంటున్నారు కొత్త ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిన వాటికి అర్హత డిగ్రీ మరియు రాత పరీక్ష ఇంటర్వ్యూలు అంటూ పకడ్బందీగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని చూస్తుండడం సంతోషదాయకం దాదాపుగా 1.08 లక్షల మంది రాజీనామాలు చేశారు. ఇప్పుడు వీరంతా స్థానిక కూటమి నేతలకు వినతులు అందిస్తున్నారు.

About Author