ఏలూరు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిల ఫ్యాను గుర్తుపై ఓటేసి గెలిపించండి
1 min readఓటర్లకు వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి
జగన్ ప్రచార సభకు వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు, అభిమానులు,అశేష జనవాహిని
జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఏలూరు పట్టణానికి విచ్చేశారు. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నాలుగు కుడళ్లు మధ్యలో ప్రచార సభను ఏర్పాటు చేశారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడి వచ్చిన అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అశేష జానవాహిని కి మన గుర్తు ఇదేనని ఫ్యాన్ గుర్తును చూపిస్తూ అభివాదం చేశారు. ఫ్యాను ఇంట్లో ఉండాలని, పాడైన తుప్పు పట్టిన సైకిల్ బయట ఉంచాలని, వాడేసిన టీ గ్లాస్ చెత్త బుట్టలో ఉండాలన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వారాల్లో జరగబోతున్న కురుక్షేత్ర సంగ్రామమని, ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు కాదని, పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే యుద్ధం కాదన్నారు. వచ్చే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తుని, నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అన్నారు. ఇంటి ఇంట అభివృద్ధి అన్నారు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్లీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేయటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్టేనన్నారు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరిని సవినయంగా కోరుతున్నా అన్నారు. అలాగే మీ బిడ్డ జగన్ ని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి విజయాన్ని చేకూర్చాలని సవినయంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఈ బహిరంగ ప్రచార సభకు జిల్లాల నలుమూలల నుండి వేలాదిగా పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.