మాజీ సైనికుల ఓట్లు మాత్రం కావాలి…వారి సమస్యలు పాట్టించుకోరా!
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మాజీ సైనికుల సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు కర్నూలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టిడిపి గవర్నమెంట్ మింట్రీ హాస్పిటల్ కట్టుకొని స్థలం కేటాయించినది గత పది సంవత్సరాల నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగలేదు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు సెంటర్ గవర్నమెంట్ పాటించుకోవడం లేదు అది అలాగే పెండింగ్ అయిపోయినది అదేవిధంగా ఈసీహెచ్ హాస్పిటల్ కొరకు గవర్నమెంట్ బిల్డింగ్ ఇంతకుముందు ఫారెస్ట్ ఆఫీస్ వారు ఖాళీ చేసిన బిల్డింగ్ అడుగుతే అది ఇవ్వడం లేదు ఆ బిల్డింగ్ ఖాళీగానే ఉంది అమ్మ ఆస్పటల్ దగ్గర రెంటుకు తీసుకున్న బిల్డింగ్ ఖాళీ చేయమని చెప్తున్నారు అదేవిధంగా మన కర్నూలులో మాజీ సైనికులు 6000 మందికి పైగా ఉన్నారు వారి ఓట్లు మాత్రం కావాలి ఇక్కడ మాజీ సైనికులు 70 సంవత్సరాలు దాటిన వారు చాలామంది ఉన్నారు ఈ చిన్న సమస్య వచ్చినా హైదరాబాద్ పోవాలి లేక కర్నూలు సొంత డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి మాజీ సైనికులకు హెల్త్ కు సంబంధించి మింట్రీ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ ఏ హాస్పటల్ వారైనా ఎం పేనల్ హాస్పిటల్ అనుసంధానం అప్లై చేసుకుని వచ్చును అప్పుడు మాజీ సైనికులు ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు గత మూడు సంవత్సరాల కిందట గౌరీ గోపాల్ హాస్పిటల్ వారు అప్లై చేసినారు ఢిల్లీ నుంచి శాంక్షన్ వచ్చిన తర్వాత మాకు వద్దు అని క్యాన్సిల్ చేసినారు మిగతా ఏ హాస్పిటల్ వారు అప్లై చేయలేదు అప్లై చేయమని మేము ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఎవరు అప్లై చేయలేదు ప్రతి ట్రీట్మెంట్ కు 70 సంవత్సరాలు దాటిన వారు హైదరాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచన చేయండి ప్రతి జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్స్ పర్మిషన్ తీసుకున్నారు కర్నూలులో పెద్దపెద్ద హాస్పిటల్ ఉండి గాని మాజీ సైనికులకు సేవ చేసే గుణం లేక వారు అప్లై చేయలేదు గౌరీ గోపాల్ హాస్పిటల్ శాంక్షన్ అయిన తర్వాత గాని వారు క్యాన్సల్ చేసుకున్నారు.