మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి
1 min readఎమ్మెల్యే జయసూర్యకు కార్మికుల వినతి
సీపీఐ ఎంఎల్ నరసింహులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో పని చేస్తున్న డైలీ వేజి కార్మికుల వేతనాలు పెంచాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు అన్నారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అదే విధంగా వేతనాలు పెంచాలని కోరుతూ శుక్రవారం అల్లూరులో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యకు మరియు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి కి కార్మికులతో కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలో గత ఆరు సంవత్సరాలుగా 60 మంది పారిశుద్య కార్మికులు పనిచేస్తున్నారు.వీరికి నెలకు 9,600 మాత్రమే ఇస్తున్నారని పెరిగిన ధరలకు అనుకూలంగా జీతాలు పెంచనందున దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని ఆ జీతం కూడా ప్రతి నెల ఇవ్వకుండా 2,3 నెలలకు ఒకసారి ఇస్తున్నారని అన్నారు. ఇలాగైతే వారు కుటుంబాలను వారు ఏ విధంగా పోషించాలని అన్నారు.జీతాలు పెంచాలని కోరుతూ అదేవిధంగా ప్రతి గురువారం ఆఫ్ డ్యూటీ సెలవు ఇవ్వాలని ఎమ్మెల్యేను వారు కోరారు.అదే విధంగా కార్మిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారికి ఆఫ్కాస్ విధానంలోకి తీసుకొని వారికి కూడా పీఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని వారిని కోరగా వారు సానుకూలంగా స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు నరసింహులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్,మున్సిపల్ డైలీ వేజి కార్మిక సంఘం అధ్యక్షులు అశోక్,భాస్కర్, లింగన్న,శ్యామ్ పాల్గొన్నారు.