లోక రక్షకుడి బాటలో నడవాలి…
1 min readకడప ఆర్డీవో జాన్ ఇర్విన్..అనాథలకు ఆహారం వితరణ
పల్లెవెలుగు వెబ్ కడప: శాంతి, రక్షణ,దయా గుణానికి ప్రతిరూపమైన లోకరక్షకుడు ఏసుప్రభు సూచించిన సన్మార్గంలో నడవాలని కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ అరుణ్ కుమార్ తో కలిసి కడపలోని అమ్మ ఒడి అనాధ విద్యార్థులకు అల్పాహారం అందించారు. అలాగే బృంద వృద్ధాశ్రమం, పద్మావతి వృద్ధాశ్రమాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు .వీటితోపాటు జువెనైల్ హోమ్ విద్యార్థులకు స్వీట్లు, పండ్లు ,పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సర్వ మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు ఏసు ప్రభువు జన్మించారని,ఆయన బాటలో ఆయన సూక్తిని అనుసరించి ముందు నడవాలని మంచి మార్గదర్శకమని అన్నారు . ప్రజలు తోటి వారి పట్ల దయ, జాలి గుణాలను కలిగి శాంతియతమై జీవనం సాగించాలని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు.