PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యలోనే చైర్మన్ కౌన్సిలర్ల వాకౌట్

1 min read

ప్రతి శాఖ నుంచి వివరాలు అడిగిన ఎమ్మెల్యే

సహకరించండి పట్టణాన్ని అభివృద్ధి చేస్తా

అధికారులకు ప్రశ్నల మీద ప్రశ్నలు

ఎన్ని నిధులు వచ్చాయి వాటి వివరాలు నాకు ఇవ్వండి

నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పురపాలక సంఘ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటిసారిగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బాని 2వ వార్డు కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మరియు నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.తర్వాత అంబేద్కర్ విగ్రహానికి ఆయన కులమాల వేశారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య ప్రసంగం మొదలు పెట్టగానే మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు వైసీపీ కౌన్సిలర్లు సమావేశం నుండి వెళ్లిపోయారు.ప్రజల సమస్యల కోసం పట్టణ అభివృద్ధి కోసం చైర్మన్ మరియు కౌన్సిలర్లు సమావేశంలో చర్చించాల్సింది పోయి బయటికి వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదని దళిత ఎమ్మెల్యే అయిన నేను మాట్లాడుతుండ గానే బయటికి వెళ్లిపోవడం ఏంటని ఎమ్మెల్యే అన్నారు.ప్రజా సమస్యల కోసం ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని ఆయన అన్నారు.ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేసే గుణం ఉండాలి పట్టణంలో 2021 నుంచి 2024 వరకు రెవెన్యూ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిసి రోడ్లు ఇంటి స్థలాలు ప్రభుత్వం నుండి ఎంత మంజూర అయింది ఎంత ఖర్చు చేశారు ఎక్కడ ఎక్కడ పనులు చేశారు వాటి వివరాలు  అధికారులు నాకు తప్పకుండా ఇవ్వాలన్నారు.ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పలేకపోయారు. మున్సిపాలిటీ షాపుల్లో వేలంపాట పాడిన వారే షాపులు నిర్వహించాలని ఇతరులు షాపులు నిర్వహించడానికి వీల్లేదని వాటి వివరాలు ఇవ్వాలని అధికారులు బాధ్యతగా పనిచేయాలని బయట రాజకీయాలు చేయవచ్చు ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సభ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. మున్సిపాలిటీ ఇక్కడే పునరుద్ధరించి పట్టణాన్ని అభివృద్ధి చేస్తా అభివృద్ధికి చైర్మన్ కౌన్సిలర్లు సహకరించాలన్నారు.ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని ఎవరికైనా నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదన్నారు. 16వ వార్డు ముబారక్ ఫంక్షన్ హాల్ వెనుక 20 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ టి సుధాకర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author