మంచాల కట్ట చెరువుకు నీరు విడుదల
1 min readమంచాల కట్ట చెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్ ఆర్ బి సి కాలువ . నీరు విడుదల ..
పల్లెవెలుగు న్యూస్ గడివేముల : మంచాలకట్ట చెరువుకింద దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేసే రైతులకు మేలు చేకూరేలా మంచాలకట్ట గ్రామం వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం నుండి పంపింగ్ ద్వారా మంచాల కట్ట చెరువుకు నీరు విడుదల చేసే కార్యక్రమాన్ని శనివారం నాడు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు స్విచ్ ఆన్ చేసి ఎస్ఆర్బిసి కాలువ నుండి మంచాలకట్ట చెరువు కు నీరు విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి వర్షాలు పుష్కలంగా పడ్డాయని ప్రతిపక్షమైన వైసీపీ నాయకులు వైయస్ జగన్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు పడవని ప్రచారాన్ని వానదేవుడు తిప్పి కొట్టాడని సమృద్ధిగా వర్షాలు పడ్డాయని వర్షాల వల్ల రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయని తాగు సాగునీటికి దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ రిజర్వాయర్లు చెరువులు నీటితో నింపుతున్నట్టు ఈ సందర్భంగా పాయింట్ ఫైవ్ టిఎంసి సామర్థ్యం గల మంచాలకట్ట చెరువుకు ఎస్ఆర్బిసి ద్వారా నీటిని తోడివేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు.. వెలగమాను డాం ప్రతిపాదన తన హయాంలోనే పూర్తి చేస్తానని త్వరలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని బైపాస్ రహదారి నిర్మాణానికి త్వరలోనే నివేదికల రూపొందించి పనులు మొదలుపెట్టేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాసరెడ్డి. వంగాల మురళీధర్ రెడ్డి. టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.