PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాల్లో పారిశుధ్యానికే తొలి ప్రాధాన్యం: డీపీఓ నాగరాజ నాయుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   గ్రామాల్లో పారిశుధ్యానికి, పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు డీపీఓ నాగరాజ నాయుడు తెలిపారు. ఈ మేరకు పంచాయతీరాజ్ సిబ్బందికి ఆదేశాలిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1)గతంలో మాదిరిగానే ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శులు  నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను మండల విస్తరణ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. 2) అదేవిధంగా ప్రతి శుక్రవారం ‘ ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని ఏఎన్ఎం లతో సమన్వయం చేసుకొని నిర్వహించాలని సూచించారు.3) ప్రతి నెల 2 వ తేదీ నుంచి 5వ తేదీ లోపు, 17 నుంచి 20 వ తేదీలోపు గ్రామాల్లోని నీటి ట్యాంకులను తప్పనిసరిగా శుభ్రం చేయించాలని నిర్దేశించారు. నీటి ట్యాంకులను నింపిన ప్రతిసారి క్లోరినేషన్ చేయించాలని అన్నారు. 4)మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ దోమల లార్వా పెరగకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి నియంత్రణ చర్యలు చేపట్టాలని వెల్లడించారు.  5)గ్రామాల్లో మురుగునీరు, చెత్త కుప్పలు లేకుండా చూసుకోవాలని వెక్టార్ కంట్రోల్ యాప్ నందు తగు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో నీరు కలుషితమై అతిసార వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.  6)పి ఆర్ వన్ యాప్ నందు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని తెలిపారు.      .కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు   తెలిసిందని ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని డీపీఓ పేర్కొన్నారు.

About Author