మేము సైతం ఛలో కప్పట్రాళ్ళ.. వాల్మీకి బోయ సహోదరులకు పిలుపు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : మనం మన జాతి కోసమే కాదు అప్పుడప్పుడు ప్రజల సమస్యలపై కూడా పోరాటం చేద్దాం.6.11.2024 వ తేది బుధవారం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ గ్రామం మరియు గ్రామం చుట్టుపక్కల వున్న గ్రామ ప్రజలకు ముప్పు తెచ్చెపెట్టే విధంగా యూరేనియం తవ్వకాల గురించి,యూరేనియం తవ్వకలాను వెంటనే ఆపేయాలనీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ప్రజలకు అండగా వుంటూ ప్రజల ఆరోగ్యం కాపాడటం కొరకై మేము సైతం ఛలో కప్పట్రాళ్ళ సందర్శనం కార్యక్రమంలో పాల్గొని మన వాల్మీకి బోయ సహోదరులందరూ కలిసి కట్టుగా యూరేనియం తవ్వకాలను ఆపేందుకు పోరాటం చేయాలని మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సహోదరులందరికి పిలుపునిస్తున్న.