PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరు పట్టణాన్ని సుందరంగా తయారు చేస్తున్నాం

1 min read

కోట్లతో పట్టణంలో రహదారుల నిర్మాణం

ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందిస్తాం

అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

వైసీపీ రీ సర్వే పేరిట గట్ల పంచాయతీలు తెచ్చిపెట్టింది

2047 విజన్ తో సీఎం చంద్రబాబు ముందుకు పోతున్నారు

ఏ ఎన్నికలు వచ్చినా వైసిపి జీవితకాలం ప్రతిపక్షంలోనే కూర్చుంటారు_

2019- 24 లో వైసిపి 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది

అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో ప్రతి ఇంట్లో పండుగలగా జరుపుకునే ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా  పట్టణంలోని మార్కెట్ యార్డ్ రోడ్డు నుండి కర్నూలు బైపాస్ రోడ్డు వరకు రూ .2 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే రహదారుల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపి హయాంలో వేసిన రోడ్లే ఇంతవరకు వేయలేదని, వైసిపి ఒక్క గుంత కూడా పూడ్చిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మినూరు పట్టణాన్ని పెళ్లికూతురు లాగా ఏర్పాట్లు చేసేందుకు నాంది పలికామన్నారు. రాష్ట్రంలో ఆదర్శ మున్సిపల్ గా నిలబెడతామని, పట్టణ ప్రజలకు 24 గంటల పాటు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. టెక్స్ టైల్ పార్క్ వైసిపి ప్రభుత్వంలో వెనక్కి వెళ్లిన దాన్ని మళ్లీ తీసుకొచ్చామని తెలిపారు. అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులో వైసిపి హయాంలో జరిగిన భూముల కబ్జా, దోపిడి , ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించి 151 సీట్ల నుండి 11 సీట్లతో ప్రజలు ఇంట్లో కూర్చోబెటారన్నారు. రీ సర్వే పేరిట రైతులకు, ప్రజలకు గట్ల పంచాయతీ తెచ్చిపెట్టిందని, కూటమి ప్రభుత్వం వైసిపి చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. నా తండ్రి మాజీ మంత్రి బీబీ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు లో దొంగలు మోటర్లు ఎత్తుకెళ్లితే ఐదేళ్లగా వైసిపి అసలు పట్టించుకోలేదన్నారు. తాను 2 వేల కోట్లు ఆర్డీఎస్ ప్రాజెక్టును తీసుకొస్తే రివర్స్ టెండర్ పేరుతో వైసీపీ నాశనం చేసిందని మండిపడ్డారు. 2047 విజన్ తో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారని తెలిపారు. జెమిలి అయినా ఏ ఎన్నికలైన వచ్చిన వైసీపీకి ప్రజలు నమ్మే  స్థితులు లేరని, జీవితకాలం ప్రతిపక్షంలోనే వైసీపీ ఉంటుందన్నారు. 2014 -19లో 22 వేల మిలియన్ల లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, 2019- 24 లో వైసిపి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను నడ్డి విరిచిందన్నారు. వైసీపీ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకొచ్చి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *