ఏలూరులో ఇన్నేళ్ళు సంక్షేమాన్ని అందించాం,నేడు దానికి సాక్ష్యంగా నిలుస్తాం..
1 min readఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని
ఏలూరులో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
ఆళ్ల నానికి ప్రజల్లో ప్రజఆదరణ, మద్దతు భారీగా పెరుగుతుంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సంక్షేమ సారథి ఆళ్ల నానికి భారీగా ప్రజలలో ఆదరణ, మద్దతు పెరుగుతుదని అన్నారు. భవిష్యత్తు కన్నా ఏలూరు ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యమనీ వాలంటీర్లు అన్నారు. సంక్షేమ పాలన సారథిగా, పేదల పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానికి అన్ని వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తుందని. తాజాగా ఏలూరు 7వ డివిజన్ కు చెందిన పలువురు వాలంటీర్లు తమ ఉదోగ్యానికి రాజీనామా చేశారు. గత 5ఏళ్లుగా ఏలూరులో ఆళ్ల నాని తరపున ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించామని, అటువంటి ఏలూరులో స్వార్థ పరులు అధికారం కోసం చేస్తున్న కుట్రలు చూసి తామంతా స్వచ్చందంగా రాజీనామా చేసి ఆళ్ల నానికి మద్దతు తెలపడానికి వచ్చామని అన్నారు. తమ భవిష్యత్తు కన్నా ఏలూరు ప్రజల సంక్షేమం, భవిష్యత్తే తమకు ముఖ్యం అనుకుని రాజీనామా చేశాం అని, ప్రజలకు వాస్తవాలు వివరించడంలో తాము సైతం భాగం ఆవుతాం అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమి ఛైర్పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగోళ్ల శ్రీదేవి సహా పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.