హిందూ సంఘటన లో భాషాబేధం లేకుండా భాగస్వాములవ్వాలి
1 min readవిశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంఘటనా మంత్రి వినాయకరావ్ జీ…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు పాత నగరం లోని బొంగుల బజార్ లోని జైన్ మందిరం లో ” హిందీ భాషా ” మాట్లాడే వారితో ఏర్పాటు చేసిన సమావేశాన్ని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ ప్రారంభిస్తూ విశ్వ హిందూ పరిషత్ కర్నూలూ జిల్లాలో 12 డివిజన్ల లో కార్యకర్తలు సమర్థవంతంగా పని చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ 7 కార్యక్రమాలను నిర్వహిస్తూ దేవాలయాల ఆస్థులను రక్షించడం జరిగిందని తెలియజేశారు. విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటనా మంత్రి వినాయకరావ్ జీ మాట్లాడుతూ భారతదేశం ఎన్నో భాషల, కులాల సమ్మేళనమే నీ అటువంటి భారతదేశంలో ప్రతి నగరంలో అన్ని భాషలు మాట్లాడే ప్రజలు వారి వారి వృత్తులు చేసుకుంటూ కలిసి మెలిసి జీవిస్తున్నారనీ, ఇదే భారతదేశం యోక్క గొప్పదనమనీ అన్నారు ఇంకా మాట్లాడుతూ 1964 శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున పురుడు పోసుకున్న విశ్వ హిందూ పరిషత్ దిన దిన ప్రవర్దమానమై ఈనాడు 125 దేశాల్లో తన సేవలను అందిస్తున్నామని , దేశంలో 6 లక్షల మంది పూర్తి సమయం కార్యకర్తలు పనిచేస్తున్నారని, అలాగే 22 లక్షల గృహస్తు కార్యకర్తలు పనిచేస్తున్నారని తెలియజేశారు, ఇటువంటి విశ్వ హిందూ పరిషత్ లో భాషా బేధం , ప్రాంత బేధం లేకుండా ప్రతి ఒక్కరూ ధర్మం కోసం పనిచేయాలని , విశ్వ హిందూ పరిషత్ చేసే “సేవా” కార్యక్రమాల్లో భాగం వహించాలని, కర్నూలు జిల్లాలో జరిగే విశ్వ హిందూ పరిషత్ అన్ని కార్యక్రమాల్లో భాగం వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ధర్మ ప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్, జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,జిల్లా సహకార్యదర్శి గూడూరు గిరిబాబు, గోవిందరాజులు,నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు, ప్రఖంఢ అధ్యక్షులు వెంకటేశ్వర రావు, రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శి సునీల్,రంగస్వామి,శేఖర్ గుప్త, జైన్ సమాజం నుండి రమేష్ బండారి,రాజస్థాన్ సమాజం,విష్ణు సమాజం,గుజరాతి సమాజం లో నుండి అశోక్ కుమార్,హేమేందర్ ,మోతి సింగ్ తదితరులు పాల్గొన్నారు.