విశ్వబ్రాహ్మణులకు అండగా ఉంటాం.. ఏలూరు ఎంపి పుట్టామహేష్
1 min readవృత్తి పేర్లతోకాకవిశ్వబ్రాహ్మణగా జిఓ తీసుకొస్తాం
ఏలూరుఎమ్మెల్యే బడేటిచంటి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నివిధాలా అండగా ఉంటామని ఏలూరుఎంపి పుట్టామహేష్ కుమార్ ఎమ్మేల్యేబడేటిచంటి లుహామి ఇచ్చారు.ఆదివారం రాత్రి ఏలూరులోని రెవెన్యూ భవన్ లో విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తులు సంక్షేమ సంఘం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.సంఘఅధ్యక్షులు అప్పలభక్తుల శివకేశవరావు (శివ శ్రీ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ ప్రధానకార్యదర్శి లంకలపల్లిజగదీష్ స్వాగతంపలికారు.బిజెపి రాష్ట్ర కార్యదర్శి తపనపౌండేషన్ చైర్మన్ గారపాటి శీతారామాంజనేయచౌదరి జ్యోతి ప్రజ్వలన చేయగా విశ్వకర్మ పతాకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కన్నా ప్రసాద్ ఆవిష్కరించారు.వింజవరపుసాయినవ్యశ్రీ శిష్య బృందం స్వాగతనృత్యాన్ని ఆలపించ గా గొల్లపల్లి కామేశ్వరరావు శిధ్ధాంతి ప్రార్థన గీతాన్ని ఆలపించారు.శివశ్రీ రూపొందించిన విశ్వబ్రాహ్మణ చరిత్ర డాక్యుమెంటరీ ప్రదర్శించారు.పదవతరగతి, ఇంటర్మీడియట్ లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్ధిని విద్యార్ధులకు ముఖ్య అతిధుల చేతులమీద నగదు పురస్కారాలను అందచెశారు.ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎంపి,ఎంఎల్ఏ లతోపాటు కూటమి నేతలు తపనచౌదరి,రెడ్డిఅప్పలనాయుడులను వేదపండితులు,వేదాశ్వీరవచనాలతో ఆత్మీయ సత్కారం చేశారు.ఏలూరునుండి రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేముల దుర్గాప్రసాద్ ,స్వర్ణకారసంఘసీనియర్ నాయకులు చిట్టూరి ఉమామహేశ్వరరావు లను సంఘం ప్రముఖులు ముఖ్య అతిధులు ఘనంగా సన్మానించారు.కార్యక్రమానికి విశిష్ఠ అతిధిగా విచ్చేసిన ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులసమస్యలపరిష్కారానికి కృషిచేస్తానన్నారు.ఎమ్మెల్యేబడేటిరాధాకృష్ణ (చంటి) మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్ధులను గుర్తించి ప్రోత్సహించడం శుభపరిణామం అన్నారు.సంఘం నాయకులు శివశ్రీ కోరిన విధంగా విశ్వబ్రాహ్మణులను వృత్తులపేర్లతో పిలవకుండా విశ్వబ్రాహ్మణులు గా మాత్రమే పిలిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడి జిఓతెచ్చేందుకు కృషిచేస్తానని హామి ఇచ్చారు.విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ వృత్తుల ప్రోత్సాహానికి, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందచేసేందుకుఎల్లప్పుడుఅందుబాటులోఉండిపనిచేస్తాన్నారు. 100ఏళ్ళక్రితమేతమతాతగారికి విశ్వబ్రాహ్మణులు బియ్యపు బియ్యపు గింజ పై ఆయనపేరుచెక్కి బహుమతిగా ఇచ్చారని అంతటి నైపుణ్యంకల విశ్వబ్రాహ్మణులను అన్నివిధాలాప్రోత్సహిత్సానన్నారు.ఆత్మీయ అతిథి తపన చౌదరి మాట్లాడుతూ విశ్వంలో అనేక వింతలు డిజైన్ చేశినవారు విశ్వకర్మ అన్నారు.చరిత్రతెలియనివారుచరిత్రసృష్టించలేరని విశ్వకర్మ చరిత్ర ద్వారా తాను తెలుసుకున్నానని డాక్యుమెంటరీ నుద్దేశించి వ్యాఖ్యానించారు.సంఘం అధ్యక్షులు శివ శ్రీ మాట్లాడుతూ ఏలూరు నగరంలో విశ్వబ్రాహ్మణులు ఉత్తరక్రియలకు కోసం శాశ్వతభవనంలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,పంచ వృత్తులు వర్క్ షాపులకు విద్యుత్ రాయితీ వెసులుబాటుఉన్నా అద్దెషాపుల వల్ల వి నియోగించుకోలేకపోతున్నారని నిబంధనలు సడలించేలాకృషిచెయ్యాలనికోరారు జనశేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సమాజంలో నైపుణ్యం కలిగి ప్రాముఖ్యత ఉన్న విశ్వబ్రాహ్మణ వృత్తుల వారు చైతన్యవంతం అయ్యేందుకు విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అడుగులు వేయడం శుభపరిణామం న్నారు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి అవసరమైన వస్తువులు ఆభరణాలు పనిముట్లు తయారు చేయడంలో సిద్ధహస్తులైన విశ్వబ్రాహ్మణ వృత్తి కళాకారులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సింహాద్రి భృంగాచార్యులు. బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ జోనల్ చైర్మన్ కాదా రాంబాబు,వెస్సొట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ బంగారుతాతారావు.విశ్వంలోవిలీనంసంస్థ ఫౌండర్ చైర్మన్ పెంటశ్రీనివాసరావు. కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు పొట్నూరు శివరావు గౌరవ అధ్యక్షులు కర్రి సత్యనారాయణ కైకలూరు నియోజకవర్గ అధ్యక్షులు తుపాకుల సోమాచార్యులు ఉంగుటూరు మండల సంఘ అధ్యక్షులు అనుజు వీరబ్రహ్మం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘ ఉపాధ్యక్షులు కడియం నాని తదితరులు పాల్గొన్నారు. సంఘ కోశాధికారి నాగమల్లి దుర్గారావు వందన సమర్పణ చేశారు.