కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ రూపశిల్పి సంఘసంస్కర్త అనివారణ వర్గాల ఆర్థిక సామాజిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో బిజెపికి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ అన్నారు. అంబేద్కర్ ని అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోని క్షమాపణ చెబుతూ కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల అధ్యక్షులు మొలగవెళ్ళి రామాంజనేయులు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, సీనియర్ నాయకులు తుంబలబీడు లక్ష్మన్న, మీసాల గోవిందప్ప, వరకుమార్, తిమ్మప్ప, నవీన్, వెంకటేష్ మరియు హత్తేబేల్గల్ ఖాదర్ పాల్గొన్నారు.