PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనాథ పిల్లలను ఆదుకుంటాం…

1 min read

రాజకీయ, ప్రజా, సేవ సంఘాల నాయకులు అండగా నిలబడాలి

  • దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహబూబ్​ బాష
  • రూ.25వేల చెక్కు, 50 కేజీల బియ్యం అందజేత

హాలహర్వి, పల్లెవెలుగు: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో శనివారం జరిగిన సంఘటన లో  పింజరి కాశీంసాబు ,శేకమ్మ దంపతులు వీరికి ముగ్గురు అమ్మాయిలు సంతానం (1) ఆసాబి,వికలాంగురాలు వయస్సు 15 (2) సబియా వయస్సు 10 (3) ఆప్రిన్ వయస్సు 8 సంవత్సరాలు తండ్రి కాశీంసాబు గత నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయారు. అప్పటినుండి ఆమె పిల్లలతో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చినది.  తల్లి కూడా  అనారోగ్యం కారణంగా మరణించింది. ఈమె మరణంతో ముగ్గురు అమ్మాయిలు అనాదులుగా మిగిలారు. ఈ ముగ్గురు జీవనం సాగేందుకు చాలా కష్టంగా మారిందని,పిల్లలు దిక్కుతోచని పరిస్థితిలో వారి బంధువులు ఆరోపించారు, ఈ విషయం తెలుసుకున్న వెంటనే దూదేకుల సంఘం ప్రెసిడెంట్ మహబూబ్ బాషా స్పందించి, గూళ్యం గ్రామానికి దూదేకుల  సంఘం పెద్దలతో కలసి ఆ గ్రామానికి చేరుకొని అక్కడున్న గ్రామపెద్దలతో అనాధ పిల్లలకు 25 వేల రూపాయలు 50 కేజీల బియ్యం ప్యాకెట్ ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగిన ఈ దూదేకుల సంఘం ముందు ఉంటుందని ఈ అనాధ పిల్లలకు ముందు భవిష్యత్తు కోసం ఉన్నత చదువులకు మా వంతు కృషి చేస్తామని వారికి ప్రతి రంజాన్ పండుగ కొత్త బట్టలు ఈ ముగ్గురు పిల్లలకు ఉన్నత చదువులు కల్పిస్తామని అన్నారు. అలాగే  ప్రభుత్వం, రాజకీయ నాయకులు,ప్రజా సంఘాలు,స్వచ్చంద సంస్థలు,ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి దూదేకుల సంఘం ప్రెసిడెంట్,మహబూబ్ భాష, అసిస్టేషన్, నూర్ భాషా, ఇమామ్ కాశీం ,హౌస్ స్టేట్ ప్రెసిడెంట్ , సిద్దయ్య, సెక్రెటరీ, మస్తాన్ వర్కింగ్ సెక్రెటరీ, షేక్షావలి అడ్వకేట్, మాలిక్ స్టేట్ నెంబర్ దూదేకుల సంఘం నాయకులు,మా భాష, వలిసాబ్, షేక్షావలి, హుస్సేన్ సాబ్, హొలగుంద. కో ఆప్షన్ నెంబర్. అలాగే.నూర్ భాషా దూదేకుల మండల అధ్యక్షులు. ఆలూరు నియోజకవర్గం 9 టీవీ ఛానల్ రిపోర్టర్.టీ.పి.సాయి భేష్.బడేసాబ్, హుస్సేన్ పీరా, ఎల్లప్ప బసవరాజ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

About Author