బీసీల సమస్యల పరిష్కారం కోసం అన్ని బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తాం..
1 min readజాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్
పనిచేసే వారికి పదవులు ఇచ్చి సంఘాన్ని ప్రక్షాళన చేస్తాం…బోను నరేష్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగాబీసీ సంక్షేమ సంఘం కమిటీలు ప్రక్షాళన జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్చార్జి బోను దుర్గానరేష్ తెలిపారు..గన్నవరం, ఏలూరు,పాలకొల్లు,రాజమండ్రి,ఉమ్మడి కృష్ణ, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కమిటీలు వేస్తున్నామని,కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందచేస్తున్నమని చెప్పారు..పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీసీ సంఘాలను నిర్మూలిస్తామని అయన స్పష్టం చేశారు… గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు… ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలువేసి నివాళులర్పించారు.. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ…బీసీ సంక్షేమ సంఘలు అనేకం పుట్టుకొస్తున్నాయని బీసీలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుందన్నారు..ముందుగా వాటి ప్రక్షాళన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.. అదేవిధంగా గన్నవరం, ఏలూరు,పాలకొల్లు,రాజమండ్రి,ఉమ్మడి కృష్ణ, ప్రకాశం,ఉమ్మడి నెల్లూరు జిల్లాల వైపు నూతన కమిటీలు వేస్తున్నామని,కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందచేస్తున్నమని చెప్పారు. నూతన కమిటీలతో బీసీల సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తామన్నారు..ఏ కార్యక్రమం చేసిన అందరూ కలసి చేసుకుంటామని,బీసీలకి రావలసిన హక్కులపై పోరాడతామని అన్నారు.ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కారం చేసుకుంటామన్నారు.రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు.బీసీ కులగుణన,రిజర్వేషన్ లపై పోరాడతమని చెప్పారు.అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకలమ్మ మాట్లాడుతూ…బీసీ సంక్షేమ సంఘం అంటే నితి నిజాయితికి మారుపేరని,కొన్ని దశాబ్దాలుగా ఆర్. కృష్ణయ్య బీసీల సమస్యలపై పోరాడుతున్నరని చెప్పారు.తన కోసం కాకుండా బీసీల కోసం కష్టపడుతున్నారని అన్నారు.బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి చట్టసభల్లో బీసీలను కూర్చోబెట్టారని,బీసీ లు అందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు.మంచి చేసినంత కాలం టిడిపి,,తరువాత రాజ్యసభ సభ్యులు గా వైసిపి లో ఉండి బీసీల కోసం ఆర్ కృష్ణయ్య. పోరాడారని,అగ్రకులాలు ఇప్పుడు కృష్ణయ్య నీ విమర్శించటం తగదన్నారు.పార్టీలు,పదవులు ముఖ్యం కాదు,,బీసీ లకు న్యాయం చేసే వారి వైపే కృష్ణయ్య ఉన్నారని,మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇద్దామని అనుకుంటున్నారని చెప్పారు… ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చింతా శ్రీను,,ఏలూరు జిల్లా ఇన్చార్జి భీమవరపు హేమ, కృష్ణాజిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్,, విజయవాడ నగర అధ్యక్షులు హా కిరణ్,,మెండెం జ్యోతి,,శారదా తదితరులు పాల్గొన్నారు.