మార్కెట్ యార్డులో అక్రమాలకు చెక్ పెడతాం: ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోనిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో అక్రమాలకు ఇకనుండి చెక్ పెడతామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిగారు తెలిపారు. మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ తో కలిసి మార్కెట్ యార్డ్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. అందులో భాగంగా మార్కెట్ యార్డులో గల రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు, అదేవిధంగా అక్కడ పని చేస్తున్నటువంటి కూలీలను, హమాలీలను , గుమస్తాలను కలిసి వారి యొక్క సమస్యలు అక్కడ జరుగుతున్నటువంటి విషయాల పైన క్షుణ్ణంగా మాట్లాడారు. మార్కెట్ యార్డ్ లో మాలిక సదుపాయాల పైన మార్కెట్ యాడ్ సెక్రెటరీ తో ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు నేను తెలుసుకున్నానని, ప్రజలకు, రైతులకు, కూలీలకు, హామాలీలకు ఉన్నటువంటి ఇబ్బందులను నేను తెలుసుకున్నానని, ఆయా సమస్యల పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇంతకుముందు జరిగినటువంటి అక్రమాలకు చెక్ పెట్టి ఎక్కడా కూడా అక్రమాలు జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.