కర్నూలు రైల్వేస్టేషన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం..ఎంపీ
1 min readరైల్వేస్టేషన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు రైల్వేస్టేషన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. ఎం.పి హోదాలో మొదటి సారి రైల్వేస్టేషన్ ను సందర్శించిన ఆయన..స్టేషన్ మాస్టర్ శేషఫణి తో కలిసి రైల్వేస్టేషన్ ను పరిశీలించారు.. అనంతరం అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద చేపడుతున్న పనులను తనిఖీ చేసి, పనులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగుల హెచ్.ఆర్.ఏ ను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని, అలాగే కర్నూలు నుంచి విజయవాడ కు ప్రత్యేక రైలును వేయాలని అధికారులు ఎం.పిని కోరారు.. ఆనంతరం ఎం.పి నాగరాజు మాట్లాడుతూ రైల్వేస్టేషన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, కేంద్ర మంత్రులు తో చర్చించి వాటిని పరిష్కరిస్తానన్నారు.. ఇక ప్రజలు రైల్వే సేవలను వినియెగించుకోవాలని ఆయన కోరారు..ఈ కార్యక్రమంలో స్టేషన కమర్షియల్ ఇన్స్పెక్టర్ మునాజీ రావు, సర్వీస్ ఇంజినీర్ శివ తదితరులు పాల్గొన్నారు.