జగనన్న కాలని లో జరిగిన కుంభకోణం పై విచారణ చేపిస్తాం – ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జగనన్న కాలనీలో జరిగినటువంటి కుంభకోణం పై వెంటనే విచారణ చేపిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధ అన్నారు. సోమవారం మండగిరి పంచాయతీలోని ఆదోని నగరానికి సంబంధించిన జగనన్న కాలనీ PD తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ YSRCP కి సంబంధించిన వారిలో కొందరు మాఫీయాలాగా ఏర్పడి జగనన్న కాలనిల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మొట్టమొదటి కుంభకోణం 170 ఎకరాల భూమిని కొనడంలోనే జరిగిందని, ప్రజలకు దూరం అవుతుందని, ప్రజలు ఇక్కడ స్వయంగా ఇల్లు కట్టుకోలేరని, వారే ఆప్షన్ త్రీ సెలెక్ట్ చేసుకుని నాశిరకoగా నిర్మాణం చేసి, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు.ఇంకా ఇల్లు కట్టడం పూర్తి చేయకముందే రావాల్సిన నిధులు 1,50,000 వారి అకౌంట్ రూపాయలు రావటం కారణంగా వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. జగనన్న కాలనీ ప్రస్తుతం స్మశానాన్ని తలపిస్తుందని ఎద్దేవా చేశారు. PD ,D.E గారూ,EE దీనిపై మళ్లీ క్వాలిటీ చేకింగ్ చేసీ గృహ నిర్మాణ శాఖకు వివరణ ఇవ్వాలని కోరారు.జగనన్న కాలనీలో కుంభకోణం చేసిన వారిపై , కారకులైన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోని,క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు.