PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం.. కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్  సిస్టం) కార్యక్రమానికి 132    ఫిర్యాదులు .

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన  పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.

 దివ్యాంగుల వద్దకు వెళ్ళి ఫిర్యాదులను స్వీకరించి, న్యాయం చేస్తామని భరోసా కల్పించిన  జిల్లా  ఎస్పీ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు సోమవారం  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 132  ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1)        కర్నూలు వెంకటరమణ కాలనీ కి చెందిన షేక్ సాదిక్, షేక్ తస్లీమా, గుంటూరు కు చెందిన రవి లు  కలిసి మాకు బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి  ఫేక్ లెటర్స్ ఇచ్చి 5 మంది నుండి రూ. 30 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , బంగారు పేటకు చెందిన దివ్యాంగుడైన మురళీ మోహన్  ఫిర్యాదు చేశారు.

  పెద్దల నుండి వంశపార్యం పరంగా వచ్చిన 3 ఎకరాల పొలాన్ని మా వదిన సరోజ ,   రిటైర్ట్ ఉద్యోగి రత్నస్వామి 3 సెంట్ల స్ధలాన్ని ఆక్రమించుకున్నారని అన్యాయం చేశారని నాకు పొలాన్ని,  స్ధలాన్ని ఇప్పించే విధంగా  న్యాయం చేయాలని గార్గేయపురం కు చెందిన దివ్యాంగుడైన దేవదానం ఫిర్యాదు చేశారు. జూలై 31  న లొద్ది పల్లె  హై స్కూల్ లో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తూ రిటైర్ అయ్యాను. గవర్నమెంట్ ఆర్డర్ కాపీ వచ్చింది. స్కూల్లో పని చేస్తున్న హెడ్ మాస్టర్ ఎమ్. విజయభాస్కర్ పెన్షన్ పత్రాల పై సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కర్నూలు కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి వెంకట రమణ రాజు ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు,  సిఐ శివశంకర్   పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *