ఆర్టీసీ బస్టాండును రాష్ట్రంలోనే నంబర్ వన్ బస్టాండ్ గా తీర్చిదిద్దుతాం
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ఆర్టీసీ బస్టాండును రాష్ట్రంలోనే నంబర్ వన్ బస్టాండ్ గా తీర్చిదిద్దుతాం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక. కర్నూలు-1 డిపో గ్యారేజీలో 2 క్రొత్త సూపర్ లగ్జరీ బస్సులను మరియు 1 క్రొత్త అల్ట్రా డీలక్స్ బస్సులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ జెండా ఊపి ప్రారంభించి అనంతరం బస్సు నడిపారు. మంత్రి మాట్లాడుతూ మన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ కు గతంలో మంచి పేరు ఉండేదని, మరల గతంలో లాగానే రాష్ట్రములో నంబర్ వన్ ఆర్టిసి బస్టాండ్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఈరోజు మూడు ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన వాటి లో 2 సూపర్ లగ్జరీ బస్సులు కర్నూలు-బెంగళూరు రూటులో, ఒక అల్ట్రా డీలక్స్ బస్సు కర్నూలు-తిరుపతి రూట్ల నందు త్రిప్పడం కొరకు ఈ బస్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో 10 నూతన బస్సులను ప్రారంభించుకున్నామని, మొత్తం ఇప్పటివరకు 13 నూతన బస్సులు మన ఆర్టీసీ డిపోలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ కు ల్యాండ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ ప్రదేశంలో రాయలసీమలోనే మంచి కన్వెన్షన్ హాలు ఉండేలా కన్వెన్షన్ హాల్ నిర్మించడానికి ప్లాన్ తయారు చేయాలని ఆర్ ఎం ను కూడా ఆదేశించామన్నారు. మన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే ప్రభుత్వం, మన ముఖ్యమంత్రిఆలోచన లకు అనుగుణంగానే మన ఆర్టీసీ బస్టాండ్ ను కూడా అంచలంచెలుగా అభివృద్ధి పథం లో ముందుకు తీసుకెళ్తామని మంత్రి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు , కర్నూలు-1 మేనేజరు శ్రీమతి సుధారాణి, కర్నూలు-2 డిపో మేనేజరు సర్దార్ హుస్సేన్ , కర్నూలు-1, కర్నూలు-2 డిపోల అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.