ప్రజల సహకారంతో నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి.భరత్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు నగరాన్ని ప్రజల సహకారంతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం అనిరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని 51వ వార్డు లో ఈసిఎం కాంపౌండ్ నందు రూ.50 లక్షలతో సిసి డ్రైన్ నిర్మాణానికి నగరపాలక సంస్థ మేయర్ బి.వై. రామయ్యతో కలసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టి.జి.భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు వార్డులో తిరిగిన సమయంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నట్లు చెప్పారు. వార్డులోని ప్రజల కోరిక మేరకు ఈరోజు 50 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అమీర్ హైదర్ ఖాన్ నగర్ లో కూడా ఇదే సమస్య ఉన్నట్లు ప్రజలు తెలియజేశారని అందుకొరకు గాను అక్కడ కూడా డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ను.. మంత్రి ఆదేశించారు. కర్నూల్ నగరాన్ని అంచలవారిగా ప్రణాళిక బద్ధంగా ప్రజల సహకారంతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో ఎలక్ట్రికల్ వైర్లు కూడా క్రిందికి వ్రేలాడుతున్నాయని.. వీటిని కూడా త్వరలో అధికారులతో మాట్లాడి సరి చేపిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ బి.వై. రామయ్య, ఇంచార్జ్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్. మున్సిపల్ ఈఈ షాకీర్ హుస్సేన్, ఏఈ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.