PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫీజుల దోపిడీని అరికట్టకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతాం.. ఏఐఎస్ఎఫ్

1 min read

హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి

దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు కేటాయించాలి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :  ఎమ్మిగనూరు పట్టణంలో విచ్చల విడిగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను అరికట్టడంలో మండల విద్యాశాఖ అధికారులు విఫలం : ఏఐఎస్ఎఫ్…మండల విద్యాశాఖ అధికారులు నిద్ర మబ్బు వదిలి అధిక ఫీజుల మీద పాఠ్యపుస్తకాలు అమ్మేటువంటి పాఠశాలల మీద చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలకు సిద్ధమవుతామని  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు D.సోమన్న హెచ్చరిక ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఎమ్మిగనూరు  ముఖ్య నాయకుల సమావేశం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి సోమన్న పాల్గొన్నారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు డి. సోమన్న జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర లో మాట్లాడుతూ  పట్టణంలో రేకుల షెడ్లలో చిన్నచిన్న రూములలో పాఠశాలలు నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వేలకవేలు ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఇంత వసూలు చేస్తా ఉన్న మండల విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అయినటువంటి విషయమని తక్షణమే అధిక ఫీజులని అరికట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని పాఠ్యపుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థలను గుర్తింపు రద్దు చేయాలని లేని పరిస్థితుల్లో ఏఐఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఎంఈఓ ఆఫీస్ ముందర ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు అదేవిధంగా   చదువుకునేటువంటి విద్యార్థులకు కనీసం హాస్టల్ వసతి కూడా కల్పించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా సీటు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు  వాటితో పాటు ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి హాస్టల్లో మౌలిక వస్తువులు కల్పించి అదనపు సీట్లు కేటాయించాలి అదేవిధంగా అన్ని పాఠశాలలకు త్వరగా బుక్స్ చేరేలా చూడాలని వారు డిమాండ్ చేశారు  .లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ఈ ఉద్యమంలో నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలతో పాటు అందరిని కలిసి ఉద్యమాన్ని ముందరికి తీసుకపోతామని విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని వారు తెలియజేశారు.2016- 17 సంవత్సరాల లో డిగ్రీ ఉత్తీర్ణులు కానటువంటీ విద్యార్థులకు మరల అవకాశం కల్పించాలి .2016- 17 సంవత్సరాల లో డిగ్రీలో తిరునల్ కానటువంటి విద్యార్థులు చాలామంది తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారని అందులోనూ ఏదో ఒక కోచింగ్ చేస్తూ జాబ్స్ కోసం రెడీ అవుతున్నారు అని వారికి పరీక్ష రాసేందుకు అవకాశం మరొకసారి కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు మునిస్వామి, ఖాదర్, దస్తిగిరి, రవి, సూరి, బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author