PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పిస్తాం..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి కల్పిస్తామని మండలంలో ఎవరు కూడా సొంత ఊరును విడిచి వెళ్లకండని ఏపీవో భక్తవత్సల్యం, ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, టెక్నికల్ అసిస్టెంట్ శేషన్నలు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన హోళగుందలో గత రెండు మూడు రోజులుగా కొంత మంది తమ సొంత ఊళ్లను విడిచి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెలుతున్నారని ఆ విషయం మా దృష్టికి రావడంతో అవగాహన కల్పించామన్నారు. ఎంఎస్ఆర్జీఎస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని కొంత మంది అధిక డబ్బులు సంపాదించడం కోసం సొంత గ్రామాలను విడిచి వెలుతున్నరన్నారు. ఇలా ఊరు విడిచి వెళ్లితే చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వారు తెలియజేశారు. ఎవరు కూడా సొంత గ్రామాలను విడిచి వెళ్లవద్దని వారు పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *