రైతులకు సాగునీరు అందిస్తాం – డిసీ చైర్మన్ మిక్కిలినేని ప్రసాద్
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆయకట్టు పరిధిలో రైతులకు చివరి ఎకరా వరకు సాగునీటిని అందించేలా చర్యలు చేపడతామని డిసీ చైర్మన్ మిక్కిలినేని ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎల్ఎల్సి ఎస్డిఓ హసన్ భాష, ఎస్ ఈ మస్తాన్,ఇరిగేషన్ డి ఈ షఫీ,ఏఈ.ఈశ్వర్ లతో కలిసి కాలువపై ఉన్న డిస్ట్రిబ్యూటీరిలను పరిశీలించారు.ఈ నేపథ్యంలో మండలంలోని 53 54 55 56 57 డిపి లను వారు పరిశీలించి డిపిల వద్ద త్వరలోనే మరమ్మతు పనులను చేపడతామని వీటికి సంబంధించి ఇప్పటికే నివేదికలు కూడా తయారు చేశామన్నారు. అలాగే అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో ఎల్ఎల్సీ కాలువపై ఉన్న కారిడార్ వంతెన దెబ్బతిన్నదని వాటిని త్వరలోనే మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపామని ఉత్తర్వులు వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తామని వారు అన్నారు. అలాగే ఆయకట్టు రైతులకు సాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఇన్చార్జి తనయుడు, తెలుగుదేశం యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్,హొళగుంద మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ రాజా పంపన్న గౌడ్,మిక్కిలినేని శ్రీనివాసులు, కొడాలి వేణు, డిసి చైర్మన్ ఉస్మాన్, తెలుగుదేశం పార్టీ నాయకులు బాబి,విజయ్, అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ ముళ్ళమోయిన్, మెంబర్లు, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.