జాతీయ స్థాయి క్రీడలకు చేరుకున్న ముస్ఖాన్ కు సహయ సహకారాలు అందిస్తాం
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముస్కాన్ అనే విద్యార్థి ని క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించడం తో కాశ్మీర్ లో ఆడేందుకు సహయ సహకారాలు అందిస్తామని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా సెక్రెట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన క్రీడాకారిణి ముస్ఖాన్ ను పూల మాల వేసి సన్మానించి అభినందించి ప్రోత్సాహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న షేక్ ముస్ఖాన్ జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో జరుగే జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనేందుకు తన వంతు ఆర్థిక ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. సందర్భంగా మండలంలోని పాఠశాల నుంచి విద్యార్థినిని జాతీయ స్థాయిలోకి క్రీడారంగంలో రాణించేందుకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బి వరదరాజు లు, అశోక్ రెడ్డి, ఎంఇఓ మోహినుద్దీన్, హెచ్ ఎం హంపయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు బస్వరాజు, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.