సాగునీటి కష్టాలను తొలగించి రైతాంగానికి అండగా ఉంటాం
1 min readదెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పంట నష్టం పై రైతులకు భరోసా పూర్తి భరోసా
మరమ్మత్తులు నిమిత్తం 4రోజుల పాటు కృష్ణా కెనాల్లో నీటి సరఫరా నిలిపివేత
రైతులు సహకరించాలలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదపాడు మండలంలో ఆదివారం ఉదయం పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.వసంతవాడ నుంచి తోటగూడెం వరకు కృష్ణా కెనాల్ ను పరిశీలించిన చింతమనేని తూములు అధ్వాన్న స్థితిలో ఉండటంతో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమంటూ స్థానిక రైతులు తెలిపారు.సత్వరమే కృష్ణా కెనాల్ మరమ్మత్తులు చేపట్టాలని, గుర్రపు డెక్క సహా పలు అవాంతరాలను తొలగించి రైతులకు నీటి ప్రవాహం యదేచ్చగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఫోన్లో ద్వారా ఎమ్మెల్యే వివరాల సేకరించారు. కృష్ణా కెనాల్ మరమ్మత్తుల నిమిత్తం 4 రోజుల పాటు అధికారులు నీటి ప్రవాహం నిలుపుదల చేస్తారని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, గ్రామాల్లో రైతులకు ఈ సమాచారం సమగ్రంగా చెరవేసేలా కూటమి నాయకులు చొరవ చూపాలని చింతలేని ప్రభాకర్ సూచించారు. అనంతరం తోట గూడెం గ్రామంలో అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు పార్టీ నాయకులను పరామర్శించిన అనంతరం గ్రామ వీధుల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు. డ్రెయిన్లు సహా పలు సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకువచ్చిన స్థానిక మహిళలు సత్వరమే చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు విజయవాడ కృష్ణా కాలువకు చివరి ఆయకట్టులో వున్న సీతంపేట కెనాల్, ఏలూరు రూరల్, పెదపాడు అయకట్టులోని ప్రాంతాల రైతులు సాగునీటి కొరతతో సమస్యలు తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చింతమనేని తెలిపారు. కాలువలో దట్టంగా గుర్రపుడెక్క, బద్దనాచు, కర్ణ పెద్దఎత్తున ఉందని, దీనిని తొలగించేందుకు ట్రాక్టర్లతో దమ్ము చేయాల్సిన అవసరముందని అధికారులకు సూచించామన్నారు. వారి సూచన మేరకు నేటి నుంచి నాలుగురోజుల పాటు నీటిని నిలుపుదల చేసి కాలువలో అడ్డంకులను తొలగించి ఈ సీజన్ మొత్తం సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చింతమనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ గుత్తా అనిల్ సహా పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.