PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాత‌బ‌స్తీలో ట్రాఫిక్ కష్టాలు తీరుస్తాం..  మంత్రి టి.జి భ‌ర‌త్‌

1 min read

టౌన్ ప్లానింగ్ అధికారుల‌తో మంత్రి స‌మీక్ష స‌మావేశం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని పాత‌బ‌స్తీలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో టౌన్ ప్లానింగ్ అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తర‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. న‌గ‌రంలో అత్యంత ర‌ద్దీ  ప్రాంత‌మైన ఓల్డ్ సిటీలో ప్ర‌జ‌లు ప్రయాణాలు సాగించ‌డం క‌ష్టంగా ఉంటుంద‌న్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ ట్రాఫిక్ స‌మ‌స్యను తీర్చేందుకు ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. చౌక్ బ‌జార్ నుండి జ‌మ్మిచెట్టు వ‌ర‌కు వెళ్లే దారితో పాటు వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్, రాంబొట్ల దేవాల‌యం వెళ్లే దారిలో ట్రాఫిక్ స‌మ‌స్య తీవ్రంగా ఉంద‌న్నారు. ఈ దారిలో రోడ్డు విస్తర‌ణ చేసేందుకు టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు సంబంధించి ఎలాంటి చ‌ర్యలు తీసుకోవాలో ప్రణాళిక త‌యారుచేయాల‌ని ఆదేశించారు. ఇల్లు, దుకాణాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌ర‌స్పరం చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రజ‌ల అంగీకారం లేకుండా దౌర్జన్యంగా కూల్చివేసే ప‌రిస్థితి త‌మ ప్రభుత్వంలో ఉండ‌ద‌ని మంత్రి చెప్పారు. దీంతో పాటు ష‌రాఫ్ బ‌జార్‌, బిర్లా గేట్ వ‌ద్ద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఖాలీ చేయించే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపించాల‌న్నారు. ఏ ఒక్కరూ రోడ్డున ప‌డ‌కుండా వారు వ్యాపారాలు చేసుకునేందుకు త‌గిన విధంగా స్థలం చూపించి న‌గ‌రంలో అభివృద్ది ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. దీంతోపాటు ఇంకెవ్వరూ ఆక్రమ‌ణ‌లు చేప‌ట్టకుండా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. వీట‌న్నింటిపై స్టడీ చేసి ప్రణాళిక త‌యారుచేయాల‌ని అధికారుల‌ను మంత్రి టి.జి భ‌ర‌త్ ఆదేశించారు. ఈ స‌మావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.

About Author