PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఆదోనిలో వారానికోసారి తాగునీరు…!

1 min read

మూడు సార్లు ఎమ్మెల్యే… అయినా ప్రజల నీటి కష్టాలు పట్టించుకోరా…?

  • వైసీపీకి ఓటు వేస్తే కష్టాలే….
  • బీజేపీకి ఓటు వేయండి… అభివృద్ధి ఏమిటో చూపిస్తా…
  • కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

ఆదోని, పల్లెవెలుగు:  మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సాయి ప్రసాద్​ రెడ్డి… ఒక్కసారైనా మీ కష్టాలు చూసి….. పరిష్కరించే ప్రయత్నం చేశారా… అని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ప్రజలను సూటిగా ప్రశ్నించారు. వేసవి వచ్చిందంటే చాలు…  కొన్ని కాలనీల్లో వారానికోసారి తాగునీరు…మరికొన్ని కాలనీలో పదైదురోజులకోసారి…. ఇదేమని ఎప్పుడైనా నిలదీశారా…. ప్రజలను అడిగారు. “మీరు వైసీకి ఓటు వేసినన్ని రోజులు ఇలాగే ఉంటుంది…. ఒక్కసారి బీజేపీకి ఓటు వేయండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెడతాను”అని డా.పార్థసారధి స్పష్టంగా వెల్లడించారు. శుక్రవారం  ఉదయం పట్టణంలోని ఎన్టీఆర్​ కాలనీ, నిజాముద్దీన్​ కాలనీ, పెద్ద శక్తి గుడి,  సాయంత్రం అంబేద్కర్​ కాలనీ, కౌడల్​పేటలో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగ కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు సరిగా లేవు… రోడ్ల విస్తరణ చేపట్టలేదు… తాగునీరు రావు… వీధిలైట్లు పడవు… మురుగు ముందుకు పోదు…. ఇంకెన్ని రోజులు కష్టాలను భరిస్తారు…. ఇప్పటికైనా ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిని సాగనంపండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. భూ కబ్జాలు, దందాలు, లిక్కర్​, ఇసుక, రేషన్​ మాఫియాతో కోట్ల రూపాయలు సంపాదించిన సాయి ప్రసాద్​ రెడ్డి … మీ కష్టాలను పరిష్కరించే సమయం లేదు… అని ఎద్దేవ చేశారు.  కమలం గుర్తుకు ఓటు వేసి… తనకు ఒక్క అవకాశం ఇస్తే… ఆదోనిని జిల్లాలోనే మోడల్​ ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఆటో డ్రైవర్ల కష్టాలు పట్టవా.. రెడ్డి…?

సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఆటోమిత్ర పథకం కింద ఏడాదికి రూ.10వేలు ఇచ్చి….  జరిమానా, ఇన్సూరెన్స్​ తదితర కారణాలు చూపుతూ  ఏడాది రూ.30 నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నాడని, ఇది ఆటో డ్రైవర్లు గమనించాలని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి సూచించారు. ఆదోనిలో రోడ్లు వెడెల్పు లేవు… గుంతలమయమైన రోడ్లతో ఆటో పరికరాలు ఊడిపోతున్నాయి. పెట్రోల్​ ధర అధికంగా ఉంది. అన్నీ పోనూ రోజుకు రూ.300 నుంచి రూ.500 కూడా రావడంలేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు డా. పార్థసారధి పేర్కొన్నారు.  రోడ్లు కూడా వేయని వైసీపీ ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. తనను గెలిపించిన వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు.

About Author