PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వాలు మారుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కరువాయే..

1 min read

ఈ ప్రభుత్వమైనా స్పందించి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్.. పి డి ఎస్ ఓ నాయకులు

పల్లెవెలుగు  వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో హాస్టళ్లకు సొంత భావనలు ఏర్పాటు చేయాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పిడిఎస్ఓ కార్యాలయం నందు పిడిఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్రబాబు సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అద్దెకు ఉన్న బిల్డింగులకు సరైనటువంటి అద్దె బిల్లులు చెల్లించక బిల్డింగ్ యాజమాన్యం ఎప్పుడు ఖాళీ చేయండి అంటే అప్పుడు విద్యార్థులను బయటకు పంపించి విద్యార్థులు రోడ్లపై కొచ్చి నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అద్దె భవనాల్లో విద్యార్థులు స్టెంత్ సరిపోక అప్లై చేసుకున్న వారికి సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అద్దె భవనాల్లో సరైనటువంటి వసతులు లేక అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల విద్యార్థుల విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది.  కాబట్టి  ప్రభుత్వం  విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎమ్మిగనూరులో సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ తాలూకా అధ్యక్ష కార్యదర్శిలు వీర ప్రతాప్, ఇమ్రాన్ భాష, ఫయాజ్, తేజ,తదితరులు పాల్గొన్నారు.

About Author