పేదల సంక్షేమమే వైఎస్సార్సీపీ లక్ష్యం – బుట్టా ప్రతుల్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నందవరం మండలంలోని హెచ్.బాపురం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మిగనూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక తనయుడు బుట్టా ప్రతుల్ గారు. రాష్ట్రంలో పేదలకు సంక్షేమం,విద్య,వైద్యం అందించటడమే వైఎస్సార్సీపీ లక్ష్యమని ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా హెచ్.బాపురం గ్రామంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు.బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ.. గతంలో పేదలు అనారోగ్యం పాలైతే అప్పులు చేసి కుటుంబ సభ్యలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల ఉంచి రూ.25 లక్షల వరకు పెంచామని చెప్పారు. మనబడి నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాల స్థాయిలో తీర్చిదిద్దామని తెలిపారు. పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాలో అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి రూ. 15వేలు ఆర్థికం సహాయం జమ చేస్తున్నామన్నారు. మే 13న జరగనున్న సార్వత్రి ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బుట్టా రేణుక ని,కర్నూలు ఎంపీ అభ్యర్థి బి.వై.రామయ్య ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నందవరం మండల అధ్యక్షులు శివారెడ్డి గౌడ్,నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు విరుపాక్షి రెడ్డి,మండల సీనియర్ నాయకులు కె ఆర్ రామకోటేశ్వర్ రెడ్డి,ప్రకాశ్ రెడ్డి ,నరహరి రెడ్డి,ఎల్లారెడ్డి ,చిన్న రాముడు,చిన్న మద్దిలేటీ,రాఘవేంద్ర,రాముడు,చంద్ర,సురేష్ ,వెంకటేష్ ,నరసప్ప ,గిద్దయ్య ,గోపాల్ ,కుమ్మరి చిన్న రాముడు ,రమేష్,గోబ్బరి బ్రదర్స్, స్వామిఅంజినయ్య,హాలహర్వి నాయకులు సర్పంచ్ తిమ్మప్ప ,ఎంపీటీసీ దావీదు ,హాజరత్ భిలాల్, జయరాముడు,ప్రతాప్,జయరాజు, ఇషాక్,కాశిం,రాజు, వెంకటేష్,సొట్ట శివ,తిమ్మయ్య,కొండయ్య,జగ్గపురం నాయకులు ఎంపీటీసీ కోతి ఈరన్న ,నరసరాజు,వీరేశ్ ,చిన్న కర్రయ్య ,హనుమన్న ,చిన్నన్న ,ధర్మపురం నాయకులు ఖాసీం,రంగస్వామి ,నరసన్న ,వెంకటేష్ ,నగప్ప తదితరులు పాల్గొన్నారు.