ఆ 3 కేసుల మద్యం ఏమైనట్లు..?.
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలోని ఒక గ్రామంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో దాదాపు మూడు కేసుల(144) బాటిళ్ళు మద్యం మూడు రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. స్వాధీనం చేసుకున్నట్లుగా భావిస్తున్న ఆ మద్యం మూడు కేసులు ఏమైనట్లు.? అనేది చర్చనీయంశంగా మారినట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి ఇంతవరకు సంబంధిత ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించలేదని సమాచారం. స్వాధీనం చేసుకున్న మధ్యానికి సంబంధించి అది ఎక్కడి నుంచి వచ్చాయి, సప్లై చేసిన మద్యం దుకాణానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వివరాలు ఎందుకు వెల్లడించడం లేదు అనేది పలు విమర్శలకు తావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై సంబంధిత ఎక్సైజ్ వర్గాలను వివరణ కోరగా ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం లేదని, ఎవరు దాడి చేశారో ఎంత మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అనే వివరాలు మాకు అందజేయలేదు అన్నారు. ఇంతకు ఆ మద్యం బాటిళ్లు ఏమైనట్లు అనేది ప్రశ్నార్థకంగా మారినట్లు సమాచారం.